వైద్యుల నిర్లక్ష్యం.. తల్లీ బిడ్డ మృతి
ADB: గుడిహత్నూర్ మండలం శాంతపూర్ గ్రామానికి చెందిన గర్భిణి చిక్రం రుక్మాబాయి పురిటి నొప్పులతో 108 సహకారంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు రెండవ కాన్పు సిజేరియన్ చేయగా, డెలివరీ తర్వాత నిన్న రాత్రి తల్లీ బిడ్డ ఇద్దరూ మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య, బిడ్డ మృతి చెందారని భర్త చిక్రం సుభాష్ ఆరోపించారు.