ఉమ్మడి ఆదిలాబాద్‌లో 7 డిగ్రీల ఉష్ణోగ్రత
ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలిపంజా విసురుతోంది. ముఖ్యంగా ఏజెన్సీల్లో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. ASF జిల్లా సిర్పూర్ యూ 8.9, తిర్యాణి 9.5, కెరమెరి 11.1, ఆసిఫాబాద్ 11.5 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొడిగాలి, బలంగా వీస్తున్న ఈశాన్య గాలుల కారణంగా చలి తీవ్రత పెరుగుతోందని అధికారులు తెలిపారు.