వ్యవసాయ బావిలో పడి మహిళా మృతి

వ్యవసాయ బావిలో పడి మహిళా మృతి

KNR: మహిళ వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన ఘటన శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శకుంతల మతి స్థిమితం లేక బావిలో పడి మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.