రామయ్యను దర్శించుకున్న హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ

రామయ్యను దర్శించుకున్న హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ

BDK: తెలంగాణ రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సీవీ ఆనంద్ బుధవారం కుటుంబ సమేతంగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారిని బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీవీ ఆనంద్‌కు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ విశిష్టత గురించి వారికి తెలిపారు.