నిర్మల్ ఆసుపత్రిలో గుర్తుతెలియని మృతదేహం
NRML: జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో ఒక గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈనెల 8న ఉదయం 11 గంటలకు ఈ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని, మృతుని కుడిచేతిపై 'మామ్ డాడ్' అని రాసి ఉందని ఆయన పేర్కొన్నారు. సదరు మృతుని గురించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.