అన్న క్యాంటీన్‌ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

అన్న క్యాంటీన్‌ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

NTR: తిరువూరు పట్టణంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ కే. మనోజ శనివారం పరిశీలించారు. క్యాంటీన్‌లో అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా రుచి చూసి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడి ఆహార నాణ్యత, నిర్వహణ విధానాలు, పరిశుభ్రతపై వివరాలు తెలుసుకున్నారు. సిబ్బంది శుభ్రతను పాటిస్తూ నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.