పదో తరగతి పరీక్షలపై అధికారుల కసరత్తు
ATP: రాష్ట్రంలో 2025 - 26 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చిలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తేదీల ఖరారుపై విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. మార్చి 16, మార్చి 21 రెండు తేదీలతో వేర్వేరుగా టైంటేబుల్స్ రూపొందించి అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఈ రెండిటిలో దేనికి అనుమతి వస్తే దాని ప్రాకారం పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.