పండుగ పూట విషాదం.. యువకుడి దుర్మరణం

పండుగ పూట విషాదం.. యువకుడి దుర్మరణం

BDK: మహాశివరాత్రి పర్వదినాన మణుగూరు మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కట్టు ఉడతనేని గుంపు ప్రాంత శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరుప సుదీర్‌(21) అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. పండుగ పూట చేతికి అందిన కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.