గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్‌గా వాసుదేవరావు ఏకగ్రీవం
KMM: జిల్లాకు చెందిన బీజేపీ నేత దేవకి వాసుదేవరావుకు అరుదైన గౌరవం లభించింది. ది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) రాష్ట్ర గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి టీసీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురవారెడ్డి అధికారికంగా ప్రకటించారు. జిల్లా ప్రజలు, క్రీడాభిమానులు, బీజేపీ నాయకులు, శుభాకాంక్షలు తెలిపారు.