గోదావరి పుష్కర ఏర్పాట్లపై CS సమీక్ష
HYD: రాష్ట్రంలో రానున్న గోదావరి పుష్కరాలకు భక్తులకు ఇబ్బంది కలగకుండా భారీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. ఇవాళ 8 జిల్లాల్లోని పుష్కర ఘాట్ల వద్ద సౌకర్యాలపై అధికారులతో సమీక్షించారు. CM సూచనల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించాలని వారికి సూచించారు. ఈ పనుల పర్యవేక్షణకు ఈఎన్‌సీలు, చీఫ్ ఇంజనీర్ల కమిటీని రంగంలోకి దింపామన్నారు.