షర్మిల ‘హంతకుడి' వ్యాఖ్యలపై స్పందించిన అవినాశ్ రెడ్డి

షర్మిల ‘హంతకుడి' వ్యాఖ్యలపై స్పందించిన అవినాశ్ రెడ్డి

కడప: తాను వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. ‘ఆ కామెంట్స్ వినడానికే భయంకరంగా ఉన్నాయి. మసిపూసి బూడిద జల్లి తుడుచుకోమంటారు. తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. మాట్లాడేవాళ్లు మనుషులైతే, వారిది మనిషి పుట్టుకే అయితే విజ్ఞత, విచక్షణ ఉండాలి' అని అవినాశ్ మండిపడ్డారు.