అయ్యప్ప ఆలయంలో ప్లాస్టిక్ రహిత భిక్ష
KMR: బాన్సువాడ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్లాస్టిక్ రహిత భిక్ష నిర్వహించాలని గురుస్వామి పోతులబోగుడ శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా బుధవారం కిరణ్ గురుస్వామి 200 గ్లాసులు, కప్పులు, చెంచాలను అయ్యప్ప సేవ సమితికి అందజేశారు. ప్లాస్టిక్ రహిత భిక్షకు సహకరించిన వారికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని ఆలయ కమిటీ తరపున కోరారు.