శివరాత్రికి ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు

శివరాత్రికి ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు

VSP: జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 14, 15 తేదీల్లో ఆర్కే బీచ్, అప్పికొండ, కళ్యాణపులోవ, మత్స్యలింగం క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. భక్తుల రద్దీ దృష్ట్యా నగరం, వివిధ డిపోల నుంచి అదనపు సర్వీసులు అందుబాటులో ఉంటాయని బుధ‌వారం ఆర్టీసీ రీజిన‌ల్ మేనేజ‌ర్ బి. అప్ప‌ల‌నాయుడు తెలిపారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.