అదృశ్యమైన బాలికలను గుర్తించిన పోలీస్ బృందాలు
అన్నమయ్య జిల్లాలోని గాలివీడులో ఇద్దరు బాలికలు మిస్సైన విషయం తెలిసిందే. కాగా వారిని ఇవాళ నెల్లూరు కసునూరు దర్గా వద్ద గుర్తించారు. వారిని గాలించేందుకు 12 ప్రత్యేక పోలీస్ బృందాలు పని చేశాయి. సాంకేతికత సాయంతో బాలికల ఆచూకీ గుర్తించిన పోలీసులు, వారిని సురక్షితంగా నెల్లూరు సఖి వన్ స్టాఫ్ సెంటర్కు తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.