వినాయక చవితి.. అధికారులకు మంత్రి ఆదేశాలు

TG: గ్రేటర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరిగేలా చూడాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఈ మేరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టనున్న ఏర్పాట్లు పక్కాగా, వేగవంతంగా జరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలతో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.