శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపాడు. 'శ్రీరామనవమి రోజే చరణ్ పుట్టినరోజు రావడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో పాటు, మా ఇలవేల్పు హనుమంతుని దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ శ్రీరాముని అడుగుజాడల్లో నడిస్తే విజయం ఖచ్చితంగా మనదే. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.. జై శ్రీరామ్' అని తెలుపుతూ ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేశాడు.