హత్యాయత్నం కేసులో ముగ్గురు అరెస్ట్
KDP: హత్యకు యత్నించిన కేసులో ముగ్గురు నింధితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మురళి నాయక్ తెలిపారు. శనివారం స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో CI, SIలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అల్లపాటి తిరిపాలు, అరిగెల విక్రం, కటిక శ్రీనివాసులును అదుపులోకి తీసుకొని కర్రలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న తరుణ్ అనే నింధితుని కోసం గాలిస్తున్నామన్నారు.