బాలిక మిస్సింగ్.. కేసు నమోదు

బాలిక మిస్సింగ్.. కేసు నమోదు

KRNL: నందవరం మండలంలోని గంగవరం గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక గుజ్జుల వైష్ణవి అదృశ్యం కలకలం రేపింది. సోమవారం ఎస్సై తిమ్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వైష్ణవి ఈ నెల 18న పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఒంటిపూట బడి కావడంతో మధ్యాహ్నం 3 గంటలకు రావాల్సి ఉండగా, ఆమె ఆచూకీ లభించలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు.