బాధితులను పరామర్శించిన షేక్ నూరి ఫాతిమా

బాధితులను పరామర్శించిన షేక్ నూరి ఫాతిమా

గుంటూరు నగరంలోని నెహ్రూ నగర్ జీరో లైన్, మోతీలాల్ నగర్ పరిధిలోని రైల్వే స్థలాల్లో నివసిస్తున్న పేద ప్రజల ఇళ్ల కూల్చివేతపై వైసీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఆమె సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఇళ్లను కోల్పోయిన కుటుంబాల పరిస్థితిని తెలుసుకుని అండగా ఉంటామని హామీ ఇచ్చారు.