అంబటి రాంబాబును పరామర్శించిన వైసీపీ నేతలు
GNTR: మాజీ మంత్రి అంబటి రాంబాబును ఆదివారం రాత్రి గుంటూరులో పలువురు వైసీపీ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రులు కొడాలి నాని, సుచరిత, కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నంబూరు శంకరరావు ఈ భేటీలో పాల్గొన్నారు. అక్రమ కేసులు, అరెస్టులతో వైసీపీని భయపెట్టలేరని, ఇటువంటి చర్యల వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.