అంబులెన్స్‌లో ఆకస్మిక తనిఖీ
NZB: సిరికొండ మండలంలోని అత్యవసర పరిస్థితులలో సేవలు అందించే మండల కేంద్రానికి చెందిన 108 అంబులెన్స్‌ను జిల్లా కో-ఆర్డినేటర్ స్వరాజ్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేసారు. అంబులెన్సులో వున్న వైద్య పరికరాలు, మందులు, రికార్డులను పరిశీలించారు. సిబ్బంది అన్ని వేళలా అత్యవసర సేవలు అందించేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.