బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
NLG: అడవిదేవులపల్లి మండలం కొత్త నంది కొండ గ్రామానికి చెందిన రమావత్ స్వామి అనారోగ్యంతో ఇవాళ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న BRS రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్ధార్థ నేడు స్వామి నివాసానికి వెళ్లి ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట ధనావత్ బాలాజీ నాయక్ తదితరులు ఉన్నారు.