రౌడీ షీటర్ల పై పోలీసుల నజర్..!
HYD: హైదరాబాద్ నగరం పరిధిలోని నాలుగు కమిషనరేట్లలో ఉన్న రౌడీ షీటర్లపై కఠిన చర్యలకు పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే వారి కార్యకలాపాల పై నిఘా పెంచిన అధికారులు, కొందరు విదేశాలకు పారిపోగా మరికొందరు బీదర్ ప్రాంతంలో నుంచి అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం సేకరించారు. ఈ నేపథ్యంలో సమగ్ర ఏరివేత చర్యలకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.