'అన్న క్యాంటీన్ల పర్యవేక్షణ తప్పనిసరి'

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్న క్యాంటీన్‌లలో సమయపాలన పాటిస్తూ ఆహారం అందించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. బస్టాండ్ వద్దనున్న అన్న క్యాంటీన్‌ని కమిషనర్ బుధవారం పరిశీలించారు. క్యాంటీన్ పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నోడల్ అధికారులు తమకు కేటాయించిన క్యాంటీన్‌లను పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు.