హార్ట్ ఫెయిల్యూర్.. ముందస్తు లక్షణాలు ఇవే!
ఆకస్మిక మరణాలకు దారితీసే హార్ట్ ఫెయిల్యూర్ గురించి అప్రమత్తంగా ఉండాలి. హార్ట్ ఫెయిల్యూర్ ముందు శరీరంలో పలు కీలక సంకేతాలు కనిపిస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల్లో ద్రవాల కారణంగా తరచూ దగ్గు, తీవ్రమైన అలసట, అకస్మాత్తుగా బరువు పెరగడం, గుండె దడ వంటి సంకేతాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.