సముద్రపు ఒడ్డున ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం.

సముద్రపు ఒడ్డున  ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం.

SKLM: సంతబొమ్మాళి మండలం లింగూడు పంచాయతీలో ఉన్న మత్యలేశంసున్నాపల్లి గ్రామంలో సముద్రపు ఒడ్డున శుక్రవారం ప్రపంచ మత్యకారుల దినోత్సవం నిర్వహించారు. మహిళలందరూ పసుపు కుంకుమ చందనం కలిపిన ముర్రాటలు వేపకొమ్మలతో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడాది పొడుగునా వేటకి వెళ్ళిన సమయంలో మా కుటుంబ యజమానులను రక్షించాలని గంగమ్మ తల్లిని వేడుకున్నారు.