తైక్వాండో విద్యార్థులకు బెల్ట్ ఎగ్జామ్స్

GDL: ఐజ పట్టణంలోని తైక్వాండో గ్రౌండ్‌లో విద్యార్థులకు మంగళవారం బెల్ట్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తైక్వాండో జనరల్ సెక్రటరీ శ్రీహరి చీఫ్ ఎగ్జామినర్‌గా వ్యవహరించి విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. ప్రతిభ చాటిన 100మంది విద్యార్థులకు మాస్టర్లు మధు కుమార్, శ్రీనివాసులు శెట్టి, సుధీర్‌ల ఆధ్వర్యంలో బెల్టులు ప్రధానం చేశారు.