రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
MBNR: మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలో జడ్చర్ల-కల్వకుర్తి రహదారిపై ఇవాళ కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాణిపేట గ్రామానికి చెందిన బోయ మల్లేశ్ (28) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, వృత్తిరీత్యా లారీ డ్రైవర్గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.