VIDEO: చౌరస్తాలో BRS నాయకుల రాస్తారోకో
SDPT: హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల రాస్తారోకో చేపట్టారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో దౌర్జన్యంగా పెట్టారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు.