పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల పంపిణీ
నల్గొండ మండలం నర్సింగ్భట్ల గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శనివారం పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశువైద్య సిబ్బంది సుజాత, శివ మాట్లాడుతూ.. ఈ వ్యాధి సోకడం వల్ల పాలు ఇచ్చే పశువుల సామర్థ్యం తగ్గి పాడి రైతులు నష్టపోతారన్నారు. ముందస్తు నివారణకు ప్రతి ఆరు నెలలకోసారి తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు.