పిల్లల విషయంలో ఈ పొరపాట్లు చేయకూడదు!
పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. క్రమశిక్షణ పేరుతో ఎక్కువగా తిట్టడం, నలుగురిలో తిట్టడం లేదా ఇతరులతో పోల్చడం వల్ల వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. వారిలో అభద్రతా భావం పెరుగుతుంది. భయం కంటే ప్రేమతో విషయాలను వివరించండి. మంచి, చెడుల మధ్య వ్యత్యాసాన్ని సున్నితంగా నేర్పండి. వారిలోని ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి, లక్ష్యాల దిశగా వెన్నుతట్టండి.