గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు సహకారం: మంత్రి
NLG: గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు తగిన సహకారం అందిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈనెల 28 నుంచి డిసెంబర్ 12 వరకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే NPL -6 గోడ పత్రికను బుధవారం మంత్రి, మునిసిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్ అబ్బగోని రమేష్, నిర్వాహకులతో కలిసి సచివాలయంలో ఆవిష్కరించారు.