'ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు'

'ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు'

ప్రకాశం: మార్కాపురం శాఖ గ్రంధాలయం ఆధ్వర్యంలో 58వ గ్రంథాలయ వారోత్సవాలు గురువారంతో ముగిశాయి. వారం రోజులుగా వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిధి కమిషనర్ నారాయణరావు బహుమతులు ప్రధానం చేశారు. జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు గ్రంథాలయాలు ఉపయోగపడతాయని, వాటిని వినియోగించుకోవాలని విద్యార్థులకు కమిషనర్ సూచించారు.