టెక్కలిలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి

SKLM: టెక్కలిలో శనివారం రాత్రి పేకాట శిబిరంపై దాడి చేసినట్లు పోలీసులు ఆదివారం సాయంత్రం తెలిపారు. స్థానిక సబ్ కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై రఘునాధరావు తన సిబ్బందితో దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, ఆరు సెల్ ఫోన్లు, రూ.48 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.