జనగణన సర్వేపై ముమ్మరంగా శిక్షణ
పల్నాడు: పెదకూరపాడు జడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం జనగణన సర్వేపై రెండోరోజు శిక్షణ తరగతులు జరిగాయి. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు సాంబశివరావు, నేహమతుల్లా ఫీల్డ్ ట్రైనింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ వరలక్ష్మి పర్యవేక్షించారు. గ్రామాల్లో చేపట్టే సర్వేకు ప్రజలంతా అధికారులకు సహకరించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు.