జూబ్లీహిల్స్‌లో పాలమూరు నాయకుల ప్రచారం
MBNR: జూబ్లీహిల్స్ ఎన్నికలలో పాలమూరు నాయకులు శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గ పరిధిలోని రహమత్ నగర్ కార్పొరేషన్ పరిధిలో మహబూబ్‌నగర్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షబ్బీర్ తదితరులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారానికి కొద్దిరోజులు మాత్రమే ఉండడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తున్నారు.