నేడు జిల్లాలో బీజేపీ శాసన సభా పక్ష నేత పర్యటన
BHNG: బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో పర్యటించనున్నారు. మొంథా తుఫాన్‌తో నష్టపోయిన పంటలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించేందుకు సోమవారం వస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం పది గంటల వరకు తుక్కాపురం గ్రామంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.