ఆలయ మండలి కోసం దరఖాస్తులు ఆహ్వానం

ఆలయ మండలి కోసం దరఖాస్తులు ఆహ్వానం

CTR: పుంగనూరు పట్టణంలో పరశురాముల వారిచే ప్రతిష్టించబడిన చారిత్రక మాణిక్య వరదరాజ స్వామి ఆలయ ధర్మకర్తల మండలి నియామకానికి దేవాదాయ శాఖ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 27లోపు చిత్తూరు చర్చి వీధిలోని జీవ కారుణ్య అన్నదాన సత్రం వద్ద గల దేవాదాయ శాఖ అధికారికి దరఖాస్తులు సమర్పించాలని కార్యనిర్వహణాధికారి ఏకాంబరం తెలిపారు.