ఎంపీపీ నూతన భవనానికి భూమి పూజ చేసిన మంత్రి

ఎంపీపీ నూతన భవనానికి భూమి పూజ చేసిన మంత్రి

NDL: కోయిలకుంట్ల పట్టణంలో మండల ప్రజా పరిషత్ నూతన కార్యాలయ భవనానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం నాడు భూమి పూజ చేశారు. గత ఐదు సంవత్సరాల నుండి ఎంపీపీ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. 1.50 కోట్ల వ్యయంతో నూతనంగా ఎంపీపీ భవనాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు చేస్తున్నామని ఆయన అన్నారు.