పోగొట్టుకున్న ఫోన్ అందజేత

KMR: ఫోన్ పోగొట్టుకున్న బాధితుడికి మాచారెడ్డి ఎస్సై అనిల్ శనివారం అందజేశారు. కామారెడ్డికి చెందిన బట్టు శ్రీనివాస్ ఫోన్ పోయిందని మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ గుర్తించి అందించినట్లు ఎస్సై చెప్పారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఎవరైన సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే ఫిర్యాదు చేయాలని మండల ప్రజలకు సూచించారు.