దేశంలో లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ ఏదో తెలుసా?
భారత్‌లో అత్యధిక దూరం ప్రయాణించే రైలుగా వివేక్ ఎక్స్‌ప్రెస్ రికార్డుకెక్కింది. ఇది అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడు కన్యాకుమారి వరకు 4,154 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ సుదీర్ఘ ప్రయాణానికి సుమారు 75 గంటలు పడుతుంది. ఇది 9 రాష్ట్రాల మీదుగా 50కి పైగా స్టేషన్లలో ఆగుతుంది. అయితే, నిర్వహణ లోపాల కారణంగా ఈ రైలు దేశంలోనే అత్యంత మురికిగా ఉంటుందని విమర్శలు ఉన్నాయి.