కరీంనగర్ అభివృద్ధిపై సమీక్ష

కరీంనగర్ అభివృద్ధిపై సమీక్ష

KNR: పర్యటనలో భాగంగా గవర్నర్ జిష్ణు దేవ్‌ వర్మ శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందు శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి పవర్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా సమగ్ర స్వరూపాన్ని, కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరును గవర్నర్‌కు వివరించారు. పథకాలు సమర్థవంతంగా అమలు అవుతున్నాయని తెలిపారు