ZPHS విద్యార్థులు సాధించిన స్కాలర్షిప్

ELR: నూజివీడు మండలం అన్నవరం జడ్పీ హైస్కూల్‌లో ఇద్దరు విద్యార్థులు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS) కోసం ఎంపికైనట్లు హెచ్ఎం విజయ కుమారి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంపికైన మరిపి కళ్యాణి, ప్రత్తిపాటి సూర్య అనే విద్యార్థులకు ఏడాదికి 12,000 చొప్పున నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించనున్నట్లు తెలిపారు.