నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLR: సీతారామపురం విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మతులు చేపడుతున్న దృష్ట్యా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీహరి తెలిపారు. బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మండల పరిధిలోని అన్ని ఫీడర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని అన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.