VIDEO: రోడ్ల అధ్వాన స్థితిపై బీజేపీ వినూత్న నిరసన

GDWL: జిల్లా కేంద్రంలోని రోడ్ల అధ్వాన స్థితిపై బీజేపీ మంగళవారం నిరసన తెలిపింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని బీజేపీ పట్టణ అధ్యక్షురాలు జయశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ చౌక్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపై నిలిచిన నీటిలో వరి నాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు.