రెండో భార్యతో గొడవ.. మనస్తాపంతో ఆత్మహత్య

రెండో భార్యతో గొడవ.. మనస్తాపంతో ఆత్మహత్య

HNK: ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన కత్తెరశాల చందర్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య శ్వేతతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనితో మనస్తాపానికి గురైన చందర్ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, చందర్‌కు మొదట మమతతో వివాహం జరగగా, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.