హిందూపురంలో స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ

సత్యసాయి: హిందూపురం పట్టణంలో మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛాంధ్ర ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ చిన్న మార్కెట్ నుంచి గాంధీ బొమ్మ వరకు సాగింది. ఛైర్మన్ మాట్లాడుతూ.. ఇళ్లల్లో, పరిసరాల్లో చాలా కాలంగా నిల్వ ఉన్న నీటిని తొలగించాలన్నారు. నిల్వ ఉన్న నీటితో దోమలు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందన్నారు.