ఇంటర్ పరీక్షలకు 9.8 లక్షల విద్యార్థులు
TG: ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమవుతాయి. ఉ.9 నుంచి మ.12 గంటల వరకు రాత పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు.. ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. ఉ.9-12, మ.2-5 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే, పరీక్షలకు 9.8 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. నిన్నటి వరకు 9,79,506 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు.