YS జగన్ నేటి పర్యటన వివరాలివే..!
KDP: YS జగన్ నేటి పర్యటన వివరాలను YCP వర్గాలు వెల్లడించాయి. ఉదయం 9 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి 9:45లకు లింగాల మండలం ఇప్పట్లలోని దివంగత సుధాకర్ రెడ్డి ఇంటికి చేరుకుంటారు. 10:15 వరకు అక్కడే ఉండి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం 11 గంటలకు బయలుదేరి భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయానికి రానున్నారు. సాయంత్రం 6:25 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారు.