పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

NZB: బాన్సువాడలో పేకాట స్థావరంపై టాస్క్‌‌‌‌‌‌‌ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యాపారవేత్తలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 13,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. జనవసతుల మధ్య పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.